నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- February 05, 2026
ఆమ్స్టర్డామ్: నెస్లే తన SMA బేబీ ఫార్ములాలోని మరో బ్యాచ్ ప్రొడక్ట్ ను రీకాల్ చేసింది.గత నెలలో నెదర్లాండ్స్‌లోని దాని తయారీ కర్మాగారాలలో ఒకదానిలో సాధారణ పరీక్షలో బాసిల్లస్ సెరియస్ బాక్టీరియం ఉత్పత్తి చేసే టాక్సిన్ అయిన సెరూలైడ్ ఉనికిని గుర్తించిన తర్వాత దాని ఇప్పటివరకు 60 కంటే ఎక్కువ బ్యాచ్‌లను రీకాల్ చేసింది.
సెరూలైడ్ అనేది హీట్-రెసిస్టంట్ టాక్సిన్, ఇది తీసుకుంటే వాంతులు మరియు విరేచనాలకు కారణమవుతుంది. మెదడు మరియు నాడీ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడటానికి ఉపయోగించే బేబీ ఫార్ములాలో కీలకమైన పదార్ధమైన అరాకిడోనిక్ యాసిడ్ (ARA) ఆయిల్ లో సమస్యలను గుర్తించినట్లు నెస్లే తెలిపింది.
ARA ఆయిల్ ను ఒక చైనీస్ తయారీదారు సరఫరా చేశారని, పౌడర్ మరియు రెడీ-టు-ఫీడ్ ఫార్ములాలు సహా అనేక SMA ఉత్పత్తులలో దీనిని ఉపయోగిస్తారని పేర్కొన్నది. అంతర్గత నాణ్యత తనిఖీల ద్వారా ప్రభావితమైన బ్యాచ్‌లను గుర్తించామని మరియు రీకాల్‌లు ముందుజాగ్రత్త చర్యలో భాగమని నెస్లే తెలిపింది. దీనిపై ఇప్పటికే విచారణ ప్రారంభించామని వెల్లడించింది. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడొద్దు..
- మూడు దశాబ్దాలకు పైగా ప్రవాసాంధ్రులకు సేవలు.. ఉద్యోగ విరమణ చేసిన జాన్ సుందర్ శీలా
- అబుదాబిలో దీపావళి వేడుకల్లో పాల్గొన్న షేక్ నహ్యాన్ బిన్ ముబారక్..
- ఖతార్‌లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు..
- హజ్ 2027కు భారత్‌కు 1,75,025 మంది యాత్రికుల కోటా..
- దుబాయ్‌లో మరో కీలక పెడెస్ట్రియన్ బ్రిడ్జి..
- ఇరాన్‌కు ఆయుధాల సరఫరాను అడ్డుకోవడమే అమెరికా వ్యూహం!
- ఖోర్ ఫక్కాన్‌లో ఆయిల్ మరకలు.. అల్ లులూయా బీచ్ తాత్కాలికంగా మూసివేత
- లడఖ్‌లో ప్రపంచలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్
- రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ







