ఆశపోతు బ్రహ్మచారి
- July 21, 2015
పూర్వం పాటలీపుత్రంలో ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు.అతని పేరు వేదవర్మ. అతను బ్రహ్మచారి. ఒకరోజు ఆ ఊరి రాజుగారు ఊరిలోని బ్రహ్మచారులందరినీ పిలిచి విందు భోజనాలు పెట్టాడు. భోజనం తరువాత దక్షిణ తాంబూలాలతో పాటు ఒక కుండలో పేలపిండిని వేసి ఆ బ్రహ్మచారులకి దానంగా ఇచ్చి పంపించాడు. వేదవర్మ ఆ కుండను పట్టుకొని తన ఇంటికి బయల్దేరాడు. కొంత సేపటికి అతనికి అలసట వచ్చి నిద్ర ముంచుకొచ్చింది. దాంతో అక్కడ ఉన్న ఒక కుమ్మరి శాలలోకి పోయి నిద్రపోదామనుకున్నాడు. లోపలికి వెళ్లి ఒక మూల తన చేతిలోని పేలాల కుండనుంచి చేత్తో తను తెచ్చుకున్న కర్రను ఊతంగా చేసుకుని కాస్త నిద్రలోకి జారాడు. అతని కుండ పెట్టిన వరుసలోనే కుమ్మరి చేసిన చాలాకుండల వరుస కూడా ఉంది. అది అతను గమనించకుండానే నిద్రలోకి వెళ్లిపోయాడు. వేదవర్మకి నిద్రలో రకరకాల ఆలోచనలు వచ్చాయి. ముందుగా పేలపిండిని అమ్మి డబ్బు చేసుకుంటాను. తరువాత కుండని కూడా అమ్ముతాను. దీనితో వచ్చిన డబ్బులతో ఒక పొలం, రెండు ఎడ్లు కొంటాను. పొలాన్ని మంచిగా సాగు చేసి ఇంకా డబ్బు సంపాదిస్తాను. వచ్చే ఏడాది ఆ డబ్బుతో వజ్రాల వ్యాపారం చేస్తాను. దాంతో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించి ఒక పెద్ద భవనం కట్టుకుంటాను. అప్పుడు నేను ఊరిలో పెద్ద ధనవంతున్ని అయిపోతాను. ఒక ధనవంతుల అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. నాకు ఒక కొడుకు పుడతాడు. వాడికి మా నాన్న పేరు పెట్టుకుంటాను. ఎప్పుడైనా నా భార్య నా కొడుకుని కొట్టిందంటే అప్పుడు నేను కూడా దాన్ని కర్రతో రెండు వాయిస్తాను అంటూ తన చేతిలో ఉన్న కర్రను ఆడించాడు నిద్రలోనే. ఇంకేముంది. తన పేలాల కుండతో పాటు అదే వరుసలో ఉన్న కుమ్మరి కుండలు కూడా భళ్లున పగిలిపోయాయి. ఆ శబ్దానికి కుమ్మరి వాడు వచ్చి దేవవర్మను మందలించి, ఆ కర్రతో చేయి కూడా చేసుకుని నానా శాపనార్ధాలు పెట్టి తరిమేశాడు. దేవవర్మ చాపు తప్పి కన్నులొట్ట బోయినట్లయ్యి బతుకు జీవుడా అనుకుంటూ ఇంటి దారి పట్టాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







