తరుణ్ భాస్కర్ తో వెంకీ...
- July 29, 2016
రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న పెళ్లిచూపులు సినిమా, రిలీజ్ తరువాత కూడా అదే హవాను కంటిన్యూ చేస్తోంది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్నే సాధించింది. షార్ట్ ఫిలింస్ తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్, ఈ సినిమాతో వెండితెర మీద కూడా సత్తా చాటాడు. దీంతో క్రేజీ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి.తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు కథను ముందుగా సురేష్ బాబుకు చెప్పాడు. సురేష్ స్వయంగా సినిమాను నిర్మించకుండా రాజ్ కందుకూరి నిర్మాణంలో తన సమర్పణలో సినిమాను రూపొందించారు. అయితే పెళ్లిచూపులు ఫస్ట కాపీ చూసిన సురేష్ బాబు వెంటనే తరుణ్ భాస్కర్ కు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమా అవకాశం ఇచ్చాడు. తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ లో తరుణ్ చేయబోయే సినిమా విషయంలో క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం బాబు బంగారం రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న వెంకటేష్, తరువాత సాలాఖద్దూస్ రీమేక్ లో నటించనున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







