'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- February 08, 2026
చెన్నై: ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం చెన్నై లోని టి.నగర్ లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉచిత తెలుగు శిక్షణ తరగతులు ఏర్పాటయ్యాయి.ఆకాశవాణి విశ్రాంత ఉద్యోగిని బిట్రా గజగౌరి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.ప్రతి శనివారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఐదు నెలలపాటు తరగతులు జరుగుతాయి.సుమారు 50 మంది డబ్బింగ్ ఆర్టిస్టులు,కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు,లయన్స్ క్లబ్ సభ్యులు,విశ్రాంత ఉద్యోగులు శిక్షణలో చేరారు.ముందుగా సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి మోహన్ రావు మాట్లాడుతూ...తెలుగు భాషాభివృద్ధి సమాఖ్య అధ్యక్షులు వి.ఎల్ ఇందిరాదత్ సేవలని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సభుయలు రుక్మిణీదేవి,గోటేటి వెంకటేశ్వరరావు,ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- కొత్త IT చట్టం రూల్స్
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్‌లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్‌లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!









