2027 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ పార్ట్-త్రీ
- February 08, 2026
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం 2016 సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యం, కుటుంబ విలువలు, ఆధ్యాత్మికతతో పాటు నాగార్జున ద్విపాత్రాభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా బంగార్రాజు పాత్రకు స్పందన వచ్చింది.. దీనికి సీక్వెల్ ‘బంగార్రాజు’లో నాగార్జున, నాగచైతన్య నటించారు. ఆ మూవీ 2022 సంక్రాంతికి రిలీజై ఆకట్టుకుంది.
2027 సంక్రాంతికి తమ నిర్మాణ సంస్థ నుంచి ఓ సినిమా రానుందని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా తాజాగా అధికారికంగా ప్రకటించింది. హీరో ఎవరు? డైరెక్టర్ ఎవరు? ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారు? వంటి ప్రాజెక్ట్ వివరాలేమీ వెల్లడించకుండా, ఏకంగా విడుదల తేదీని అనౌన్స్ చేసింది. ”వాసివాడి తస్సాదియ్యా. వచ్చే 15th జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ గా ఉంటాది కదా. డేట్ మార్క్ చేసుకోండి” అని అన్నపూర్ణ బ్యానర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







