NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- February 08, 2026
హైదరాబాద్: నీట్-యూజీ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులు, బీవీఎస్‌సి, ఏహెచ్, బీహెచ్ఎంఎస్తోపాటు బీఎస్సీ నర్సింగ్ (ఎమ్మెన్నెస్) వంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. నేటి నుంచి నీట్ రిజిస్ట్రేషన్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తమ సైట్ http://neet.nta.nic.in లో ప్రారంభించింది. నెల రోజులపాటు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే వచ్చే మార్చి 8, రాత్రి 9 గంటలవరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే ఫీజు చెల్లించేందుకు అదే రోజు రాత్రి 11.50 గంటల వరకు అవకాశం ఉంది. అప్లికేషన్లలో పొరపాట్లు సరిదిద్దుకునేందుకు మార్చి 10-12 వరకు అవకాశం ఉంది. మే 3న, ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







