'స్వయంభు' టీజర్ ఫిబ్రవరి 11న రిలీజ్
- February 08, 2026
పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం 'స్వయంభు'తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్.
పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, పవర్ ఫుల్ పాన్-ఇండియా విజన్ తో వస్తున్న స్వయంభు నిఖిల్ అత్యంత ప్రతిష్టాత్మక వెంచర్లలో ఒకటిగా నిలుస్తుంది.
తాజాగా మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఎంతగానో ఎదురుచూస్తున్న స్వయంభు టీజర్ ఫిబ్రవరి 11న రిలీజ్ కానుంది. టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో నిఖిల్ యాక్షన్ లుక్ అదిరిపోయింది.
ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమా మీద భారీ అంచనాలను పెంచింది.
స్వయంభు నిఖిల్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా. కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో హ్యుజ్ బజ్ వున్న సినిమా.
ఇందులో తన పాత్ర కోసం నిఖిల్ పూర్తిగా ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవ్వడంతో పాటు ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు.
టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. రాజమౌళితో ఐకానిక్ సినిమాలు అందించిన KK సెంథిల్ కుమార్ సినిమాకి డిఓపి గా పనిచేయడం విశేషం. కేజీఎఫ్, సలార్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎం. ప్రభాహరన్, రవీంద్ర ప్రొడక్షన్ డిజైనర్స్.
స్వయంభు ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
తారాగణం: నిఖిల్, సంయుక్త, నభా నటేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి
నిర్మాతలు: భువన్, శ్రీకర్
బ్యానర్: పిక్సెల్ స్టూడియోస్
సమర్పణ: ఠాగూర్ మధు
DOP: KK సెంథిల్ కుమార్
సంగీతం: రవి బస్రూర్
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: విజయ్ కామిశెట్టి
ప్రొడక్షన్ డిజైనర్లు: ఎం ప్రభాహరన్, రవీందర్
యాక్షన్: కింగ్ సోలమన్, స్టంట్ సిల్వా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







