'ఆకాశంలో ఒక తార' రేపటి నుంచి రాజమండ్రిలో క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం
- February 08, 2026
వరుస బ్లాక్‌బస్టర్‌లు, పాన్-ఇండియా స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్న వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్, ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ 'ఆకాశంలో ఒక తార'తో అలరించబోతున్నారు. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో, ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. ఇంతకు ముందు విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలను పెంచాయి.
ఈ సినిమా క్లైమాక్స్ షూటింగు రేపట్నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానుంది. హీరో హీరోయిన్ పై క్లైమాక్స్ షూట్ చేయబోతున్నారు.
డైరెక్టర్ పవన్ సాదినేని ఈ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్ ని రెడీ చేశారు. బలమైన కథ , పర్ఫార్మెన్స్ లు ఉన్న క్రేజీ ప్రాజెక్టు ఇది.
శృతి హాసన్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఉండబోతుంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీని, శ్వేతా సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
ఈ చిత్రం 2026 వేసవిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శృతి హాసన్
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: పవన్ సాదినేని
రచయిత: గంగరాజు గున్నం
నిర్మాతలు: సందీప్ గున్నం, రమ్య గున్నం
సమర్పణ: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా
సంగీతం: జి.వి. ప్రకాష్
సినిమాటోగ్రాఫర్: సుజిత్ సారంగ్
ప్రొడక్షన్ డిజైనర్: శ్వేతా సాబు సిరిల్
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్‌లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్‌లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







