పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్..
- February 09, 2026
న్యూ ఢిల్లీ: పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? అయితే ఏ పథకంలో పెట్టుబడి పెడితే అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? పోస్టాఫీసు అందించే అన్ని పథకాల్లో ప్రయోజనాలు పొందవచ్చు. అన్ని సురక్షితమైన పెట్టుబడులే.. ప్రభుత్వ గ్యారెంటీ అందించే పథకాలు.
వీటితో అద్భుతమైన రాబడి కూడా పొందవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే జీరో రిస్క్ సేవింగ్ స్కీమ్స్.. పోస్టాఫీసు అందించే పథకాల్లో అద్భుతమైన పోస్టాఫీస్ పథకం ఒకటి ఉంది. అదే రికరింగ్ డిపాజిట్ స్కీమ్.. ఇందులో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే మీరు కేవలం వడ్డీనే రూ. 5 లక్షలు సంపాదించుకోవచ్చు.
ఈ పోస్టాఫీస్ RD స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి?
ఇండియన్ పోస్ట్ అనేక ప్రభుత్వ పథకాలను అందిస్తోంది. అన్ని వయసుల వారికి ఈ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి రాబడిని అందించే స్కీమ్ కోసం చూస్తుంటే పోస్టాఫీస్ అందించే రికరింగ్ డిపాజిట్ పథకం అద్భుతంగా ఉంటుంది. ఇందులో వడ్డీ నంచి పెద్ద మొత్తంలో సంపాదించుకోవచ్చు. ఈ పథకం కింద 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
పోస్టాఫీస్ ఆర్డీ పథకం కింద 6.7శాతంతో వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం కింద కేవలం రూ. 100 ప్రారంభ పెట్టుబడితో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ పథకం కింద మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లు ఉంటుంది. మరో 5 ఏళ్లు పొడిగించే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మీ పెట్టుబడిపై మరింత ఎక్కువ రాబడిని పొందవచ్చు. చిన్న రోజువారీ సేవింగ్స్ నుంచి భారీ మొత్తంలో కార్పస్‌ను కూడబెట్టుకోవచ్చు.
కేవలం 2శాతం వడ్డీకే రుణ సౌకర్యం:
పోస్టాఫీస్ RD పథకం కింద అకౌంట్ ఓపెన్ చేసే పెట్టుబడిదారులకు మరో ప్రత్యేక బెనిఫిట్ కూడా లభిస్తుంది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా రుణం తీసుకోవచ్చు. ఒక పెట్టుబడిదారుడు తమ పెట్టుబడిపై రుణం తీసుకోవాలంటే అకౌంట్ ఏడాది పాటు రన్ అయ్యాక తర్వాత డిపాజిట్ మొత్తంలో 50శాతం వరకు రుణం తీసుకోవచ్చు. 2శాతం వడ్డీ రేటు మాత్రమే వర్తిస్తుంది.
తాజా వార్తలు
- రియాద్‌లో ఘనంగా ‘ఇండియా ఉత్సవ్’..
- ఆగస్టు 31న ‘యాక్సిడెంట్-ఫ్రీ డే’..
- తెలంగాణ లో కొత్తగా TG SAFE
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్‌లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం







