ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- February 10, 2026
మస్కట్: 2025లో ఒమన్ పర్యాటక రంగం వృద్ధిని నమోదు చేసింది. అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు సుమారు 3.9 మిలియన్లకు చేరుకున్నాయని, ఇది 2019లో నమోదైన 3.5 మిలియన్లను అధిగమించిందని నివేదికలు వెల్లడించాయి.
ఒమన్ పర్యావరణ మరియు సాంస్కృతిక వారసత్వం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడి ప్రోత్సాహకాలు మరియు పర్యాటక ప్రాంతాల వైవిధ్యీకరణ ద్వారా ఒమన్ పర్యాటకం ఆర్థిక వైవిధ్యీకరణకు కేంద్రంగా మారుతుందని తెలిపారు. అదే సమయంలో అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకల పెరుగుదల ఒమన్ పర్యాటకంపై ప్రపంచ దేశాల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని వారసత్వ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
2025లో దేశీయ పర్యాటకం కూడా బలమైన వృద్ధిని నమోదు చేసింది. దేశీయ పర్యాటక పర్యటనలు దాదాపు 14 మిలియన్లకు చేరుకోవచ్చని అంచనాలు చెబుతున్నాయి. పర్యాటకుల రాకపోకలను పెంచడం మాత్రమే కాదు, తలసరి వ్యయాన్ని పెంచడం, సగటు స్టే వ్యవధిని పొడిగించడం మరియు కాంపిటీషన్, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి సవాల్ అని ఆర్థిక విశ్లేషకుడు డాక్టర్ ఖలీద్ బిన్ హమద్ బిన్ అబ్దుల్లా అల్ రవాహి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







