అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- February 10, 2026
కువైట్: కువైట్‌లో అత్యవసర వాహనాలను లేదా అధికారిక కాన్వాయ్‌లను అడ్డుకోవడం లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. మూడు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉండగా 150 నుండి 300 దినార్ల వరకు జరిమానాతో సహా కఠినమైన శిక్షలు విధించబడతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు, పోలీసు కార్లు మరియు పౌర రక్షణ వాహనాలు వంటి అత్యవసర వాహనాలకు, అలాగే అధికారిక కాన్వాయ్‌లకు, వాటి సైరన్లు మరియు ఫ్లాషింగ్ లైట్లు యాక్టివేట్ చేయబడినప్పుడల్లా సరైన మార్గాన్ని ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
అత్యవసర వాహనాలు వచ్చిన సమయంలో వాహనదారులు వేగాన్ని తగ్గించాలని, రోడ్డుకు కుడి వైపునకు క్రమంగా మూవ్ కావాలని సూచించారు. అత్యవసర, అధికారిక కాన్వాయ్‌లు వెళ్లడానికి అనుమతించడానికి అవసరమైతే ఆపాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ సూచనలను పాటించకపోతే జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసితులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్..
- దీపావళి వేళ యాదగిరిగుట్ట ఆలయ వేళల్లో మార్పులు
- కువైట్‌లో చోరీకి గురైన 4WD వాహనం లభ్యం..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించారు..!!
- ఒమన్‌లో ఆసియాకు చెందిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లకు ఊరట..!!
- దుబాయ్‌లో ఫేక్ పటెక్ ఫిలిప్ వాచ్ విక్రయం.. మహిళకు Dh10,000 ఫైన్..!!
- సౌదీ అరేబియాలో జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లకు తుది గడువు..!!
- ఖతార్ గ్రాండ్ ప్రి.. నవంబర్ 28 నుంచి రేసింగ్ సందడి..!!







