మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- February 10, 2026
దోహా: ఫిబ్రవరి 1 నుండి 4 వరకు జరిగిన నాలుగు రోజుల వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 మంచి ఫలితాలను ఇస్తోంది. మీడియా సిటీ ఖతార్‌లో చేరడానికి మొత్తం 244 కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఇది ఖతార్‌లో మీడియా మరియు క్రియేటివిటీ బిజినెస్ లను స్థాపించడంలో బలమైన ఆసక్తిని ప్రతిబింబిస్తుందని అధికారులు తెలారు. ఈ కార్యక్రమంలో సమర్పించిన దరఖాస్తులు వెబ్ సమ్మిట్ పాల్గొనేవారికి మాత్రమే అందుబాటులో ఉన్న ప్రత్యేక ప్రోత్సాహకాల నుండి ప్రయోజనం పొందుతాయని అన్నారు. వీటిలో దరఖాస్తు రుసుము మినహాయింపు, అలాగే మొదటి మూడు సంవత్సరాలకు ప్రారంభ మరియు వార్షిక లైసెన్సింగ్ రుసుము మినహాయింపులు వంటివి ఉన్నాయి.
ఈ ప్రోత్సాహకాలు ఖతార్ ఫైనాన్షియల్ సెంటర్ (QFC)తో మీడియా సిటీ ఖతార్ సహకారం ద్వారా జనవరి 2024లో సంతకం చేయబడిన అవగాహన ఒప్పందం ద్వారా అధికారికంగా రూపొందించారని మీడియా సిటీ ఖతార్ CEO హమద్ ఒమర్ ఎ. అల్-మన్నాయ్ తెలిపారు. గేమింగ్ మరియు యానిమేషన్ నుండి కంటెంట్ క్రియేట్, మీడియా సిటీ ఖతార్ డైనమిక్ మరియు అభివృద్ధి చెందుతున్న మీడియా ఇండస్ట్రీకి దోహదపడే కంపెనీలను ఆకర్షిస్తూనే ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!







