'రేజర్' షూటింగ్ పూర్తి- ఇంటెన్స్ గ్లింప్స్ రిలీజ్
- February 10, 2026
తెలుగు సినిమాలో యూనిక్ ఫిల్మ్ మేకర్ గా, నటుడిగా ముద్రవేసిన రవిబాబు ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ 'రేజర్' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తన గత చిత్రం ‘ఏనుగుతొండం ఘటికాచలం’ వంటి లైట్-హార్టెడ్ సినిమాకు పూర్తి డిఫరెంట్ గా, ఈసారి టెన్షన్, వైలెన్స్ కూడిన డార్క్ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారు
ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక బ్యానర్ సురేష్ ప్రొడక్షన్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ప్రెజెంట్ చేయగా, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తోంది. రవిబాబు–సురేష్ బాబు కాంబినేషన్‌లో మరోసారి వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకత్వంతో పాటు ఈ చిత్రంలో రవిబాబు హీరోగా కూడా నటిస్తుండటం ప్రత్యేకంగా నిలుస్తోంది.
టీం మొత్తం షూట్‌ను పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఒక పోస్టర్‌తో పాటు స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. గ్లింప్స్‌లో రవిబాబు వైలెంట్ అవతార్‌లో కనిపించారు. కారు ఇంజిన్ వాల్వ్ కవర్‌తో విలన్‌ను హతమార్చే సన్నివేశం సినిమాకు ఉండబోయే రా అండ్ సావేజ్ టోన్‌ను సూచిస్తోంది.
తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చూడని కథాంశంతో ‘రేజర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది.
ఈ చిత్రానికి చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎస్‌ఎస్ రాజేశ్ సంగీతం సమకూరుస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు సతీష్ పోలోజు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ వేసవిలో‘రేజర్’ థియేటర్లలోకి రానుంది.
తాజా వార్తలు
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు
- తీవ్ర ఒత్తిడిలో ప్రపంచం..విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు







