'అతడు' 4K ఫిబ్రవరి 28న గ్రాండ్ గా రీ–రిలీజ్
- February 10, 2026
సూపర్‌స్టార్ మహేష్ బాబు ఐకానిక్ క్లాసిక్ 'అతడు' మరోసారి గ్రాండ్‌గా వెండి తెరపైకి రాబోతోంది. ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేసిన ఈ టైమ్‌లెస్ క్లాసిక్ ఫిబ్రవరి 28న 4K ఫార్మాట్‌లో థియేటర్లలో రీ–రిలీజ్ కానుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించారు. వెటరన్ నటుడు–నిర్మాత మురళీ మోహన్ ప్రతిష్టాత్మకంగా జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు.
మహేష్ బాబు స్టైలిష్ పెర్ఫార్మెన్స్, తివిక్రమ్ మార్క్ డైలాగ్స్, క్లాస్ మేకింగ్, అద్భుతమైన పాటలు, మర్చిపోలేని యాక్షన్ తో అతడు కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.
ఇప్పుడు సూపర్ 4K లో, డాల్బీ ఆడియోతో మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
థియేటర్ లిస్ట్స్, బుకింగ్ డీటెయిల్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
ఈ ఐకానిక్ క్లాసిక్‌ని బిగ్ స్క్రీన్‌పై గ్రాండ్‌గా ఎక్సపీరియన్స్ చేయడానికి ఆడియన్స్… గెట్ రెడీ.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







