ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- February 14, 2026
మస్కట్: ఫిబ్రవరి 13న మధ్యాహ్నం ఖసాబ్‌కు వాయువ్యంగా ఉన్న ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయంలోని భూకంప పర్యవేక్షణ కేంద్రం (EMC) ప్రకారం.. స్థానిక సమయం ప్రకారం దాదాపు మధ్యాహ్నం 3:08 గంటలకు భూకంపం సంభవించింది.
ఖసాబ్‌కు వాయువ్యంగా దాదాపు 386 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది. ఇది భూకంప చురుగ్గా ఉండే దక్షిణ ఇరానియన్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని ప్రాథమిక డేటా తెలిపింది.
ముసాండం ద్వీపకల్పం నుండి దూరంగా ఉన్నా ఖసాబ్ మరియు ఉత్తర ఎమిరేట్స్‌లోని పరిసర ప్రాంతాలలోని ఎత్తైన భవనాలలో నివసించేవారు భూకంప తీవ్రతను అనుభవించినట్లు తెలిపారు. అయితే, ఆస్తి, ఎవరైన గాయాలకు గురైన సమాచారం లేదని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







