దోహాలో ఖతార్ రోబోటిక్స్ AI కాంపిటీషన్ ప్రారంభం..!!

- February 16, 2026 , by Maagulf
దోహాలో ఖతార్ రోబోటిక్స్ AI కాంపిటీషన్ ప్రారంభం..!!

దోహా: 18వ ఖతార్ రోబోటిక్స్ మరియు AI  కాంపిటిషన్ ఆదివారం దోహాలో ప్రారంభమైంది. ఈ కాంపిటిషన్ ను ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) సహకారంతో ఖతార్ సైంటిఫిక్ క్లబ్ (QSC) , యూత్ మరియు స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది.  లుసైల్ మల్టీపర్పస్ హాల్‌లో జరిగిన ఈ రెండు రోజుల పోటీలో దేశవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానాలపై ఆసక్తి ఉన్న స్కూల్స్ నుంచి యూనివర్సిటీ వరకు స్టూడెంట్స్ పాల్గొంటున్నారు.  ప్రారంభోత్సవ వేడుకలో క్రీడలు మరియు యువత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ యాసిర్ బిన్ అబ్దుల్లా అల్ జమాల్, వివిధ విభాగ డైరెక్టర్లు మరియు మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.

రోబోటిక్స్, ప్రోగ్రామింగ్ మరియు AI లలో పాల్గొని నేర్చుకోవడం ద్వారా స్టుండెట్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి మరియు నాల్గవ పారిశ్రామిక విప్లవంలో వేగవంతమైన పరిణామాన్ని కొనసాగించడానికి కృషి చేస్తున్నట్లు స్పోర్ట్స్ మరియు యూత్ మంత్రిత్వ శాఖలో యువజన వ్యవహారాల విభాగం డైరెక్టర్ ఫవాజ్ అబ్దుల్లా అల్ ముసాయిఫ్రి తెలిపారు. ఇటువంటి వార్షిక టోర్నమెంట్‌లకు మద్దతు ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ ఆసక్తిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com