బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం
- February 16, 2026
అమరావతి: హలో ఫ్రెండ్...! హౌ ఆర్ యూ..? ఇదీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి బిల్ గేట్స్ పలకరింపు. సోమవారం ఏపీలో పర్యటించేందుకు వచ్చిన గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. చంద్రబాబును చూడగానే.. బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. హలో ఫ్రెండ్...! హౌ ఆర్ యూ అంటూ సీఎం చంద్రబాబును బిల్ గేట్స్ అడిగారు. ఆ తర్వాత తన మంత్రివర్గ సహచరులను, సీఎస్ విజయానంద్‌ను బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి పరిచయం చేశారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్‌ను మంత్రి నారా లోకేష్ రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వద్ద బిల్ గేట్స్‌కు స్వాగతం పలికిన బృందంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఉన్నారు.
తాజా వార్తలు
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల
- వాణిజ్య ఒప్పందాలతో కొత్త ఆర్థిక యుగం









