ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- February 16, 2026
దోహా: ఖతార్ వ్యాప్తంగా ఆహార సంస్థలపై నిఘా తనిఖీలు నిర్వహించడం ద్వారా పవిత్ర రమదాన్ మాసం కోసం తమ సంసిద్ధతను పెంచినట్లు పలు మునిసిపాలిటీలు ప్రకటించాయి. ఈ రమదాన్ సందర్భంగా దాదాపు 10వేల రౌండ్ల తనిఖీలు చేపట్టి, 298 ఆహార నమూనాలను విశ్లేషించినట్లు దోహా మునిసిపాలిటీ తెలిపింది. చట్టాలను ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు అవగాహన కల్పిస్తున్నట్లు, అదే సమయంలో ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు దోహా మునిసిపాలిటీలోని నియంత్రణ విభాగం డైరెక్టర్ హమద్ సుల్తాన్ అల్ షావానీ తెలిపారు.
రమదాన్ సందర్భంగా తనిఖీలను వేగవంతం చేయడం ద్వారా ఏడాది పొడవునా సురక్షితమైన ఆహారాన్ని అందించడం, అన్ని ఆహార సంస్థలు వాటి వివిధ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టినట్లు అల్ షహానియా మునిసిపాలిటీలోని మున్సిపల్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ మాజిద్ బుర్హాన్ అల్ జైదాన్ తెలిపారు. మరోవైపు తనిఖీల ప్రణాళికను సిద్ధం చేసినట్టు ఉమ్ సలాల్ మునిసిపాలిటీ తెలిపింది. రెండు దశలలో తనిఖీలు నిర్వహించనున్నట్టు అల్ దాయెన్ మునిసిపాలిటీ తన ప్రణాళికలను వెల్లడించింది. ఆహార సంస్థలలో ముందస్తు తనిఖీలు చేయడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించే వాటి లైసెన్సును తాత్కాలికంగా రద్దు చేయనున్నట్లు హెచ్చరించింది.
ఆహార సంస్థలు, మాంసం దుకాణాలు, చేపల మార్కెట్లు మరియు కోళ్ల విక్రయశాలల్లో తనిఖీలను తీవ్రతరం చేయనున్నట్లు అల్ వక్రా మునిసిపాలిటీ తెలిపింది. చేపల ఉత్పత్తుల భద్రతను నిర్ధారించడానికి క్షేత్ర తనిఖీలు చేపట్టినట్టు అల్ ఖోర్ మరియు అల్ ధాకిరా మునిసిపాలిటీ తెలిపాయి. తనిఖీలను నిర్వహించేందుకు వీలుగా సిబ్బందిని నియమించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల









