మహిళను చంపిన పూజారికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

- February 17, 2026 , by Maagulf
మహిళను చంపిన పూజారికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు

హైదరాబాద్: 2022లో మేడ్చల్ మల్కాజిగిరిలో బంగారు నగల (Gold) కోసం గుడికి వచ్చిన ఓ మహిళను ఆలయ పూజరి దారుణంగా హత్య చేశాడు. చెడు వ్యసనాలకు బానిసైన దారుణ హత్యకు పాల్పడ్డాడు. నగలు దోచుకొని మృతదేహాన్ని మూడ్రోజుల పాటు గర్భగుడిలోనే ఉంచి ఆ తర్వాత మాయం చేశాడు. తాజాగా జిల్లా కోర్టు హత్య చేసిన పూజారికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా బాల సుబ్బయ్య నగర్‌కు చెందిన అనుమాల మురళీకృష్ణ అలియాస్‌ కిట్టు మల్కాజిగిరిలోని విష్ణుపురిలో నివాసం ఉండేవాడు. స్థానికంగా ఉన్న స్వయంభూ సిద్ధివినాయక గుడిలో పూజారిగా విధులు నిర్వహించేవాడు. అయితే మురళీకృష్ణ చెడు వ్యసనాలకు అలవాటు పడి లక్షల్లో అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక చోరీకి ప్లాన్ చేశాడు.

విష్ణుపురి ఎక్స్‌టెన్‌షన్‌లో నివాసం ఉంటున్న గోర్తి వెంకట నారాయణ మూర్తి భార్య ఉమాదేవి ప్రతి రోజూ ఆలయానికి వచ్చేది. దీంతో ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలపై పూజారి మురళీకృష్ణ కన్నుపడింది. ఆ నగలు దొచుకునేందుకు ఛాన్స్ కోసం వేచి చూశాడు. అదే ఏడాది ఏప్రిల్‌ 18 రాత్రి 7.30 గంటలకు ఆలయానికి వచ్చిన ఉమాదేవిని గర్భగుడిలోనికి వెళ్లి దర్శనం చేసుకోమని చెప్పాడు. ఆమె లోపలికి వెళ్లి దేవుడికి దండం పెడుతుండగా ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ఐరన్‌ రాడ్డుతో తలపై మోది దారుణంగా హత్య చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com