గోదావరి నది పుష్కరాలు ప్రారంభo...
- July 30, 2016
ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోదావరి అంత్యపుష్కరాలు వైబవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుష్కరాల ప్రారంభం సందర్భంగా ఆదివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పుణ్యక్షేత్రం నుంచి ప్రచారమూర్తులు, శ్రీపాదుకలు, చక్రపెరుమాళ్లను సమస్త మంగళవాయిద్యాలతో శోభాయాత్రగా గోదావరికి తీసుకెళ్లి పూజలు చేశారు. ఉదయం 6గంటల నుంచి 7.30 వరకు సంకల్పం, నదీపూజ, శ్రీరామానుజాచార్య స్వామివారికి అభిషేకం, సామూహిక పుష్కరస్నానం నిర్వహించారు. దేశంలో 13పుణ్య నదులకు పుష్కరాలు జరుగుతాయి. వీటిలో గోదావరి నది పుష్కరాలు ప్రధానమైనవి. ఈ నదికి గతేడాది జూలై 14 నుంచి 25 వరకు ఆది పుష్కరాలు జరిగాయి. ఇవాళ్టి నుంచి ఆగస్టు 11 వరకు అంత్య పుష్కరాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు, జిల్లా జడ్జి విజయమోహన్, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఐటీడీఏ పీవో రాజీవ్‌గాంధీ, రామాలయం ఈవో రమేశ్ బాబు, ప్రధానర్చకులు జగన్నాథాచార్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







