చిరు సినిమాలోని పాత్ర తన కోసమే : సునీల్
- July 30, 2016
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాలో చిన్న రోల్ ఇచ్చినా చేయడానికి చాలా మంది నటీనటులు ఎదురుచూస్తున్నారు. మెగా హీరోలయితే ఒక్కసారి కనిపించే పాత్ర ఇచ్చినా చాలని ప్రకటించేస్తున్నారు. ఇక మెగా హీరోలతో సమానంగా చిరుతో సన్నిహితంగా ఉండే సునీల్ కూడా మెగా మూవీలో చేసేందుకు సిద్దమని ఎప్పుడో చెప్పేశాడు.అయితే ఆ అవకాశం వచ్చినా.. ఉపయోగించుకోలేకపోయానని చాలా రోజులుగా బాధపడుతున్నాడు సునీల్. వీడు గోల్డెహే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సునీల్ చిరంజీవి 150వ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినా చేయలేకపోయాడు. దీంతో వేరే ఆర్టిస్ట్ తో ఆ సీన్స్ తీసేశారన్న టాక్ వినిపించింది. జక్కన్న రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సునీల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మిస్ అయ్యిందనుకున్న అవకాశం మరోసారి సునీల్ తలుపుతట్టిందని తెలిపాడు. తాను చేయలేకపోయానని బాధపడుతున్న చిరు సినిమాలోని పాత్ర తన కోసమే ఎదురుచూస్తుందట. వచ్చేనెలలో షూటింగ్ లో పాల్గొంటానని, మెగాస్టార్ సినిమాలో నటించటం ఎంతో ఆనందంగా ఉందంటూ ప్రకటించాడు. జక్కన్న సినిమాతో కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన సునీల్, హీరోగా మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు.
తాజా వార్తలు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







