రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- February 18, 2026
న్యూ ఢిల్లీ: త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 37 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు స్థానాలు ఉన్నాయి.ఈ నెల 26వ తేదీన ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
షెడ్యూల్ ప్రకారం.. మార్చి 5వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. మార్చి 9వ తేదీ వరకు దరఖాస్తులు విత్ డ్రా చేసుకోవచ్చు. 16వ తేదీన ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఆ రోజే సాయంత్రం 6గంటల తరువాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.
మొత్తం పది రాష్ట్రాల్లో సుమారు 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఆ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన ఎన్నికలు నిర్వహించనుంది. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా ఏడు మంది రాజ్యసభ ఎంపీలు తమ పదవీకాలాన్ని ఏప్రిల్ 2వ తేదీన పూర్తి చేసుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేఆర్ సురేశ్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏప్రిల్ 9వ తేదీన ఆ ఇద్దరి పదవీకాలం ముగియనుంది.
రాష్ట్రాల వారిగా వివరాలు ఇలా..
మహారాష్ట్రలో ఏడు, ఒడిశా రాష్ట్రంలో నాలుగు, తమిళనాడు రాష్ట్రంలో ఆరు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఐదు, అస్సాం రాష్ట్రంలో మూడు, బిహార్ రాష్ట్రంలో ఐదు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండు, హరియాణాలో రెండు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో రెండు స్థానాలకు మొత్తంగా పది రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







