ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!

- February 19, 2026 , by Maagulf
ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!

దోహా: ఖతార్ లో విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి నమోదైంది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఖతార్ (CAAQ) జనవరి 2026కి సంబంధించి విడుదల చేసిన ప్రాథమిక విమాన రవాణా గణాంకాలు వెల్లడించాయి.  ఇందులో విమానాల రాకపోకలు, ప్రయాణీకుల రద్దీ మరియు కార్గో నిర్వహణ వంటి డేటాను పొందుపరిచారు. 

జనవరి 2026లో విమానాల రాకపోకల్లో 6 శాతం పెరుగుదల కనిపించింది.  జనవరి 2025లో 23,936 నుండి ఈ సంవత్సరం 25,379కి పెరిగింది. ప్రయాణీకుల సంఖ్య 5.065 మిలియన్లకు చేరింద. గత ఏడాది ఇదే నెలలో 4.743 మిలియన్ల మంది ప్రయాణించారు.

ఎయిర్ కార్గో మరియు మెయిల్ ట్రాఫిక్ 11.2 శాతం రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. 2025లో 190,018 టన్నుల నుండి జనవరి 2026లో 211,281 టన్నులకు చేరుకుందని ICAO గ్రౌండ్ ఇన్‌స్ట్రక్టర్ ఖమిస్ అబ్దుల్లా అల్ఖెలైఫీ విశ్లేషించారు.    

ఖతార్ ఎయిర్‌వేస్ మెరుగైన పనితీరును కొనసాగించిందని, 2025లో సుమారు 84 శాతం ఆన్-టైమ్ రేటుతో ప్రపంచ నెట్‌వర్క్‌లో ఆన్-టైమ్ పనితీరుకు ప్లాటినం అవార్డును గెలుచుకుందని, ఇది 2026లో పరిశ్రమ విశ్వసనీయతకు ఘన సూచిక అని అల్ఖెలైఫీ వివరించారు.

2026 ప్రారంభంలో ఈ గణాంకాలు ఏరోస్పేస్ రంగం దేశ ఆర్థిక వృద్ధి మరియు కనెక్టివిటీకి కీలకమైన ఇంజిన్‌గా ఎదుగుతుందని సూచిస్తున్నాయని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com