బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- February 19, 2026
హైదరాబాద్: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మని ఆహ్వానిస్తూ దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈఓ) జే.భవానీ శంకర్, లోక్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్ కి బ్రహ్మోత్సవాల వైభవం, ఆధ్యాత్మిక ప్రాధాన్యం గురించి ఈఓ వివరించారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ మహోత్సవాలకు ప్రముఖులను ఆహ్వానించడం దేవస్థానం సంప్రదాయమని తెలియజేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహించే ఎదురుకోలు మహోత్సవం, స్వామివారి తిరుకల్యాణం, రథోత్సవం వంటి వైభవమైన వేడుకలు భక్తులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.
ఈ పవిత్ర బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఆశీస్సులు అందించాలని గవర్నర్ ని ఈఓ ఆహ్వానించారు.గవర్నర్ ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించినట్లు తెలిసింది.
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన మరియు వైభవోపేతమైన ఉత్సవాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ మహోత్సవాలను దర్శించేందుకు హాజరవుతారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!
- ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!
- దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?
- బౌషర్‌లో ఇంటి నుంచి ఏసీ యూనిట్ల చోరీ..!!
- సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!
- తెలంగాణ టూరిజానికి డిజిటల్ బూస్ట్..
- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..
- వాహన బీమా పేరుతో ఆన్లైన్ మోసాలు.. దుబాయ్ పోలీసుల 10 కీలక సూచనలు
- దుబాయ్‌లో ‘మొబిలిటీ ల్యాబ్స్’.. స్వయంచాలక రవాణా టెక్నాలజీల పరీక్షలకు కొత్త వేదిక







