కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- February 19, 2026
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. దాదాపు 10 మిలియన్ల ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన కమిషన్ కోసం ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్ళు కొత్త వాట్సాప్ స్కామ్‌కు తెరలేపారు.
నివేదికల ప్రకారం.. 8వ వేతన కమిషన్ కింద వారి సవరించిన జీతాలను వెంటనే అంచనా వేయవచ్చనని పేర్కొంటూ మోసగాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాట్సాప్ మెసేజ్‌లు పంపుతున్నారు. ఇందులో ఒక లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా APK ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోమని అడుగుతారు. తొందరపడి ఆ లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే ఖతమే.. మీ బ్యాంకు మొత్తం ఖాళీ చేసేస్తారు.
సైబర్ ఫ్రాడ్ ఎలా జరుగుతోంది?
వాస్తవానికి ఈ చీటింగ్ అనేది ఒక సాధారణ శాలరీ కాలిక్యులేటర్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ, ఇది నిజానికి డేంజరస్ మాల్వేర్. యూజర్లు APK ఫైల్‌ను డౌన్లోడ్ చేశాక సైబర్ నేరగాళ్లు మీ
మొబైల్ డివైజ్ రిమోట్ యాక్సెస్ పొందుతారు. వారు మీ ఫోన్ నుంచి సున్నితమైన డేటాను దొంగిలించవచ్చు.
మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసేందుకు బ్యాంకింగ్ యాప్‌లు, OTP, పాస్‌వర్డ్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారులు తాము మోసపోయిన విషయం వెంటనే గ్రహించలేరని అధికారులు హెచ్చరిస్తున్నారు. అది గ్రహించే సమయానికి వారి అకౌంట్ల నుంచి డబ్బు ఖాళీ అవుతుంది.
అసలు ప్రభుత్వం చెప్పిందేంటి?
ఇలాంటి అనుమానాస్పద వాట్సాప్ మెసేజ్, లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేసింది. 8వ వేతన సంఘానికి సంబంధించిన ఏదైనా అధికారిక సమాచారం ప్రభుత్వ వెబ్సైట్ లేదా అధీకృత మార్గాల ద్వారా మాత్రమే విడుదల అవుతుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఏం చేయాలి, ఏం చేయకూడదంటే?
గుర్తుతెలియని లింక్‌పై క్లిక్ చేయవద్దు.
వాట్సాప్ లేదా సోషల్ మీడియా నుంచి APK ఫైళ్ళను డౌన్లోడ్ చేయొద్దు.
యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్/ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి.
బ్యాంకింగ్ వివరాలు, OTP లేదా పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ షేర్ చేయొద్దు.
మీరు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను గమనించినట్లయితే.. వెంటనే బ్యాంకుకు, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930)కి రిపోర్టు చేయండి. మొత్తం మీద, 8వ వేతన సంఘంపై ప్రభుత్వ ఉద్యోగుల ఆసక్తిని సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకుంటున్నారు. దీనికి అప్రమత్తంగా ఉండటం ఒకటే మార్గం..
తాజా వార్తలు
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్‌లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!









