గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!

- February 21, 2026 , by Maagulf
గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!

రియాద్: గ్యాస్ లీకేజీలకు సంబంధించి పాటించాల్సిన సేఫ్టీ గైడ్ లైన్స్ ప్రాముఖ్యతను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ హెచ్చరించింది. విద్యుత్ స్విచ్‌లు లేదా ఫైర్ కు కారణమయ్యే ఏదైనా వనరులను ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నివాసితులు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని, గ్యాస్ వాల్వ్‌ ను సురక్షితంగా మూసివేయాలని మరియు కిటికీలు, తలుపులు నెమ్మదిగా తెరవడం ద్వారా ఆ ప్రదేశాన్ని వెంటిలేట్ చేయాలని డైరెక్టరేట్ సూచించింది. ప్రాణాలను మరియు ఆస్తిని రక్షించడానికి ఇళ్లలో గ్యాస్ లీక్ గుర్తింపు పరికరాలను పెట్టుకోవాలని సిఫార్సు చేసింది.

వివిధ మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జారీ అయ్యే భద్రతా మార్గదర్శకాలు మరియు సూచనలను పాటించాలని సివిల్ డిఫెన్స్ ప్రజలకు పిలుపునిచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోరేందుకు మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 కు మరియు రాజ్యంలోని మిగిలిన ప్రాంతాలలో 998 కు కాల్ చేయాలని నివాసితులను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com