ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- February 21, 2026
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు ఒక కొలిక్కి వచ్చింది. సీబీఐ అధికారులు దాఖలు చేసిన తుది నివేదికను పరిశీలించిన అనంతరం, కేసును మూసివేస్తూ సీబీఐ కోర్టు న్యాయమూర్తి అన్నపూర్ణ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి రెండవసారి పోస్టుమార్టం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం ఆమె అవశేషాలను సీబీఐ కోర్టు ముందు ఉంచారు.
2007లో జరిగిన ఆయేషా మీరా హత్య తర్వాత పోలీసులు, పలువురు అమాయకుల్ని నిందితులుగా చేర్చి ఈ కేసును క్లోజ్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. రాజకీయ ఒత్తిళ్లతో పెట్టిన తప్పుడు కేసుల్ని కోర్టులు కొట్టేయడంతో ఆ అమాయకులకు ఊరట లభించింది. అయితే ఇప్పటికీ ఆయేషా మీరా కుటుంబం మాత్రం న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎంట్రీ ఇచ్చిన సీబీఐ..ఆయేషా మీరా సమాధిని తవ్వి అవశేషాల్ని సేకరించింది.వీటిని కోర్టు ముందు ప్రవేశపెట్టి తమ నివేదికను అందజేసింది.
అయితే ఇందులో నిందితుల ప్రస్తావన ఉందో లేదో ఇంకా తేలలేదు. అయితే న్యాయప్రక్రియ పూర్తి కావడంతో సీబీఐ సేకరించిన తమ కుమార్తె అవశేషాల్ని తిరిగి తమకు అప్పగించాలని ఆమె తల్లితండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ పాషా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు..సీబీఐని ఆమె అవశేషాల్ని తిరిగి కుటుంబానికి అప్పగించేలా ఆదేశాలు ఇచ్చింది.దీంతో ఈ నెల 27న మరోమారు కుమార్తెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆ తల్లితండ్రులు సిద్దమవుతున్నారు.
తాజా వార్తలు
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!







