చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు
- February 21, 2026
తెలంగాణ: నిర్మల్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా చిరుత పులి సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా తానూరు, భైంసా, కుభీర్, కుంటాల మండలాల్లో చిరుత సంచరిస్తుండటంతో అటు రైతులు, ఇటు పశుపోషకులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
భైంసా మండలంలోని సిరాల గుహల్లో చిరుత పులి తన పిల్లలతో కలిసి ఆవాసం ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇటీవల తిమ్మాపూర్ ప్రాంతంలో అడవి పందులు, జింకల సంచారం పెరిగింది. వీటిని వేటాడే క్రమంలోనే చిరుత వస్తోందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. అడవి జంతువులు పొలాల్లోని మొక్కజొన్న పంటలను నాశనం చేస్తుండగా, వాటిని వెంబడిస్తూ వస్తున్న చిరుత పశువుల పాలిట యముడిగా మారింది.
స్థానిక రైతులు, పశువులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మేకలు, గొర్రెలు, లేగదూడలు, ఎద్దులు, గేదెలు వన్యమృగాల బారిన పడుతుండటంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి 17న భైంసా మండలం సిరాల శివారులో రైతు రామేశ్వర్‌కు చెందిన ఆవుపై చిరుత దాడి చేసి చంపేసింది. గురువారం మాధవ్ మొక్కజొన్న పంటలోకి వచ్చిన జింకను చిరుత హతమార్చింది. అటవీ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి చిరుత దాడేనని నిర్ధారించారు. దీంతో గ్రామస్తులు రాత్రివేళ పశువులను బయటకు కట్టడానికి వెనుకంజ వేస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







