రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- February 21, 2026
యూఏఈ: పవిత్ర మాసంలో ఇ-భిక్షాటనకు ఏఐ వినియోగిస్తున్నట్లు యూఏఈ అధికారులు హెచ్చరించారు. వైద్య అత్యవసర పరిస్థితులు, ఆన్లైన్ ఛారిటీ అప్పీళ్లను మార్చటానికి ఏఐని ఉపయోగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రకటనలు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేలా రూపొందిస్తున్నారని , వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని, అలాంటి ప్రకటనలను షేర్ చేయకుండా సంబంధిత అధికారులకు నివేదించాలని కోరారు.
వాట్సాప్ గ్రూపులలో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి పోస్ట్ లు వైరల్ చేస్తున్నారని తెలిపారు. ఈ భావోద్వేగ పోస్ట్‌లలో కొన్నింటి వెనుక నిమిషాల్లో ఏఐతో వైద్య అత్యవసర పరిస్థితులను కల్పించగలరని, వాస్తవికంగా ఉండేలా ఆసుపత్రి పరిసరాలను సృష్టిస్తున్నారని, ఫేక్ మెడికల్ బిల్స్, పేపర్లు రూపొందించి సానుభూతిని తద్వారా డబ్బులను పొందేలా కథనాలను AI మోసగాళ్ళు స్క్రిప్ట్ చేస్తున్నారని బ్రిగేడియర్ అలీ సలేం వివరించారు.
తమ ప్రత్యేక సైబర్ క్రైమ్ యూనిట్లు ఎలక్ట్రానిక్ బెగ్గింగ్ మరియు AI- ఆధారిత మోసాన్ని గుర్తిస్తున్నాయని, డిజిటల్ ఫోరెన్సిక్ సాధనాల ద్వారా తయారు చేసిన వారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. యూఏఈలో ఎలక్ట్రానిక్ భిక్షాటనకు మూడు నెలల వరకు జైలు శిక్ష మరియు Dh10,000 కంటే తక్కువ కాకుండా జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. అలాంటి వీడియోలు, ఇ-బెగ్గింగ్ సంబంధిత విషయాలను పోలీసులకు 901 లేదా అత్యవసర పరిస్థితి నెంబర్ 999 లేదా eCrime ప్లాట్‌ఫామ్: www.ecrime.ae ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







