తన పేరుతో సేవా సంస్థలు ఏర్పాటు పై కేటీఆర్ స్పందన
- February 23, 2026
హైదరాబాద్: తన పేరుతో సేవా సంస్థలు ఏర్పాటుపై కేటీఆర్ స్పందనతన పేరుతో కొంతమంది సంస్థను ఏర్పాటు చేసినట్లు వచ్చిన వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ పేరుతో కొన్ని సంస్థలు కార్యకలాపాలు చేపడుతుండటంపై ఆయన స్పందించారు. తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని వెల్లడించారు. అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదని స్పష్టం చేశారు.
తన పేరుతో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు ఎలాంటి గుర్తింపు, అనుమతి లేదనే విషయం అందరు గుర్తించాలని అన్నారు. ఎవరైనా పనిచేయాలనుకుంటే కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పరిధిలోనే చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను నిలిపివేయాలని, తనపై అభిమానం ఉన్నవాళ్లు బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







