విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం
- February 23, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ తీసుకురావడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను సోషల్ మీడియా ప్రభావం నుంచి దూరంగా ఉంచేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. శాసనసభలో సోషల్ మీడియా దుష్ప్రచారం అంశంపై జరిగిన చర్చలో ఆమె ఈ విషయాన్ని ప్రస్తావించారు.
తప్పుడు ప్రచారం, విద్వేషపూరిత పోస్టులను అరికట్టేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసిందని ఆమె తెలిపారు. ఈ కమిటీ రెండుసార్లు సమావేశమై, ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రానికి అనువైన చర్యలపై చర్చించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్వేషపూరిత మరియు అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకు 1,384 కేసులు నమోదు చేసి 1,067 మందిని అరెస్టు చేసినట్లు సభకు వివరించారు.
ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా వయసుకు తగిన సోషల్ మీడియా వినియోగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. పిల్లలు సోషల్ మీడియాలో మునిగిపోవడం వల్ల చదువుపై ప్రభావం పడుతోందని, మహిళలు ఆన్లైన్ వేధింపులకు గురవుతున్నారని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల బాధ్యతపై చర్చించేందుకు మెటా, ఎక్స్, గూగుల్, షేర్‌చాట్ సంస్థలను సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిపారు. 16 ఏళ్లలోపు పిల్లలకు కొన్ని ప్లాట్‌ఫామ్‌లపై పరిమితులు విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
ఈ అంశంపై జాతీయ విధానం అవసరమని టీడీపీ కేంద్రాన్ని కోరింది. పిల్లల ఆన్లైన్ భద్రత కోసం వయోపరిమితి ఆధారిత నియంత్రణ తీసుకురావాలని సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







