సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- February 24, 2026
సైబరాబాద్: పోలీసు సిబ్బంది విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, అదే సమయంలో వ్యక్తిగత జీవితంలో ఆర్థిక క్రమశిక్షణతో మెలగాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ సూచించారు. ఈ నెల 18వ తేదీ నుంచి 21 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన *'4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026'* విజయవంతం కావడానికి కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో, పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను సీపీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ మీట్ విజయవంతం కావడంలో అన్ని విభాగాల సిబ్బంది శక్తి వంచన లేకుండా సమిష్టిగా కష్టపడ్డారని గుర్తు చేశారు. క్రీడల్లో పాల్గొన్న సిబ్బంది ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా వారివారి యూనిట్లకు తిరిగి వెళ్లడం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో జరగబోయే అన్ని క్రీడల్లోనూ సైబరాబాద్ పోలీసులు ఇదే ఉత్సాహంతో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో ప్రతిభ ఉన్న సిబ్బందిని గుర్తించి, వారికి తగిన శిక్షణ అందిస్తామని, తద్వారా జాతీయ స్థాయి పోటీల్లోనూ పతకాలు సాధించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.
వృత్తి నైపుణ్యం - కుటుంబ బాధ్యత:
సిబ్బంది తమ విధుల్లో ఉత్పాదకతను పెంచుకోవాలని, తద్వారా వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన సమయాన్ని కేటాయించే అవకాశం ఉంటుందని సీపీ పేర్కొన్నారు. నూతన సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే వారికి పోలీస్ శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎవరి దగ్గరైనా వినూత్న ఆలోచనలు ఉంటే నేరుగా తనను కలిసి నిస్సంకోచంగా చెప్పవచ్చన్నారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







