ఆస్టిన్ లో కాల్పులు, మహిళ మృతి
- July 31, 2016
అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఒకటైన అస్టిన్ (టెక్సార్ రాష్ట్ర రాజధాని)లో ఆదివారం తెల్లవారుజామున కాల్పులు చోటుచేసుకున్నాయి. నగరంలోని డౌన్ టౌన్ లోకి తుపాకితో ప్రవేశించిన దుండగుడు రెండు చోట్ల కాల్పులకు తెగబడ్డాడని అస్టిన్ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారాన్నిబట్టి కాల్పుల్లో ఓ 30 ఏళ్ల మహిళ మృతి చెందింది. మరి కొంత మందికి గాయాలయ్యాయి.డౌన్ టౌన్ లోని ఈస్ట్ స్ట్రీట్, 208 వద్ద బుల్లెట్ దెబ్బలు తిన్న క్షతగాత్రులను గుర్తించామని, వారిని బ్రాకెన్ రిడ్జ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కు తరలించామని పోలీసులు చెప్పారు. అయితే సాయుధుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. దీంతో పౌరులు ఇళ్లల్లోనే ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







