పుదుచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్ గా తమిళ సూపర్ స్టార్
- July 31, 2016
పుదుచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్ గా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహరించాలని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కోరారు. రజనీకాంత్ ప్రజలకు సందేశం ఇస్తే ఆరోగ్యకరమైన పుదుచ్చేరిగా మారుతుందని అన్నారు. ప్రాస్పరస్ పుదుచ్చేరి కార్యక్రమాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. పుదుచ్చేరికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలంటూ గతంలో కూడా కిరణ్ బేడీ రజనీకాంత్ ను కోరారు.మే 29న పుదుచ్చేరి లెఫ్టినెంగ్ గవర్నర్ గా కిరణ్ బేడీ బాధ్యతలు చేపట్టాక ప్రతి శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మున్సిపల్ కార్మికులతో కలసి వ్యర్థపదార్థాలను తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కిరణ్ బేడీ కోరారు. ఇంటి పరిసరాలు, రోడ్లపై చెత్తను తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరికి అన్నివిధాలా సాయం చేస్తోందని, పుదుచ్చేరి ఇండస్ట్రియల్ కారిడర్ గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







