సినిమా రివ్యూ: ‘విష్ణు విన్యాసం’
- February 27, 2026
శ్రీ విష్ణు అంటేనే ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనేలా ఈ మధ్య వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అందులో ఎన్ని హిట్స్.. ఎన్ని ఫట్స్ అనే సంగతి పక్కన పెడితే.. ఓ మోస్తరు సక్సెస్‌తో శ్రీ విష్ణు బాగానే గెట్ ఆన్ అయిపోతున్నాడు. మొన్న ‘సింగిల్’తో ఓకే అనిపించుకున్నాడు. తాజాగా ‘విష్ణు విన్యాసం’ అంటూ తన పేరునే టైటిల్‌గా పెట్టేసుకుని ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ విష్ణు విన్యాసం ఎలా వుందో తెలియాలంటే ముందుగా కథలోకి వెళ్లాల్సిందే.!
కథ:
జాతకాల పిచ్చి వున్న ఓ కాలేజీ జూనియర్ లెక్చరర్ విష్ణు (శ్రీ విష్ణు). తన జాతకానికి తగ్గట్లుగా ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే కాలేజీలో హెచ్ ఓ డీగా పని చేస్తుంటుంది మనీషా (నయన్ సారిక). ఆమె జాతకంలోని దోషం కారణంగా ఆమెకు పెళ్లి జరగడం కష్టమవుతుంది. జాతకాల పిచ్చి వున్న విష్ణు, జాతక దోషం వున్న మనీషాతో ప్రేమలో పడతాడు. మరి ఇలాంటి విపత్కర సమస్య వున్న ఈ జంట ఎలా కలుస్తారు.? వీరి పెళ్లి ఎలా జరుగుతుంది.? తన జాతకాల పిచ్చి నుంచి హీరో తగ్గాడా.? లేదంటే, హీరోయిన్ జాతక దోషం తీరిందా.? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
శ్రీ విష్ణుది ఓ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అక్కడక్కడా కొన్ని బూతుల దొర్లినా.. తనదైన కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాలోనూ బాగానే ఆకట్టుకున్నాడు. ఈ మధ్య శ్రీ విష్ణు డైలాగుల్లో క్లారిటీ మిస్ అయిపోయింది.. తన స్పీడ్ డైలాగ్‌ని ప్రేక్షకుడు ఇమీడియట్గా క్యాచ్ చేయాలంటే కాస్త కష్టమే అవుతోంది. అలా ఒకింత శ్రీ విష్ణు ఈ మధ్య ఓ వర్గం ఆడియన్స్‌ని విసిగిస్తున్న మాట వాస్తవమే. అయితే, ఈ సినిమాకి కొంత రియలైజ్ అయినట్లున్నాడు. టైమింగ్‌తో పాటూ, క్లారిటీ కూడా మిస్ కాకుండా డైలాగ్స్ పలకడం మెచ్చుకోవాల్సిందే. అలాగే, హీరోయిన్ నయన్ సారిక అందంగా కనిపించడంతో పాటూ, స్ర్కీన్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది. క్లైమాక్స్‌లో ఆమె క్యారెక్టర్‌లోని ట్విస్ట్ బావుంటుంది. ఓవరాల్‌గా హీరోయిన్ క్యారెక్టర్ని కాస్త డిఫరెంట్‌గా డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు. అలాగే హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా కొంచెం కొత్తగా వుంటుంది. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ కూడా అందుకు తగ్గట్లుగానే బాగా కుదిరింది. కమెడియన్ సత్య, హీరోతో పాటూ, ఫుల్ లెంగ్త్ కామెడీ పండించాడు. వీరిద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలన్నీ, కడుపుబ్బా నవ్విస్తాయ్. బ్రహ్మాజీ, గోపరాజు గంగరాజు, మురళీ శర్మ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పని తీరు:
కొత్త దర్శకుడు ఎదురాజ్ మారుతీ రావు తన డెబ్యూ మూవీకి శ్రీ విష్ణు వంటి హీరోని సెలెక్ట్ చేసి పట్టుకోవడం బావుంది. కథ, కథనాల్లో పెద్దగా కొత్తదనమేమీ లేదు కానీ, అందరికీ తెలిసిన కథనే శ్రీ విష్ణు బాడీ లాంగ్వేజ్ యాంగిల్లో కొన్ని కొత్త మార్పులు చేసి తెరపై ఆవిష్కరించాడు. పెద్దగా రిస్కులు చేయకుండా.. కేవలం ఎంటర్టైన్మెంట్నే మెయిన్ పాయింట్‌గా పెట్టుకోవడంతో సేఫ్ జోనర్లో వున్నాడని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ 2 గంటలకే కుదించడం ఒకింత మెచ్చుకోదగ్గదే. కానీ, సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు సాగతీతలా అనిపిస్తాయ్ ఇంకా కత్తెర వేసేయొచ్చు అనేలా. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. పాటలేమీ గుర్తుండేలా వుండవ్. సినిమాటోగ్రఫీ బావుంది. కానీ, అక్కడక్కడా అవసరం లేకపోయినా గ్రాఫిక్స్ వాడేయడం నేచురాలిటీని దెబ్బ తీసినట్లనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా వున్నాయ్.
ప్లస్ పాయింట్స్:
శ్రీ విష్ణు కామెడీ టైమింగ్.. ప్రీ క్లైమాక్స్‌లో 15 నిమిషాల డ్రామా.. అలాగే క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్‌లో వచ్చే ట్విస్ట్..
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్, రొటీన్ రొట్ట కొట్టుడు కథ, కథనాలు..
చివరిగా:
‘విష్ణు విన్యాసం’.. శ్రీ విష్ణు కామెడీ విలాసం.!
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







