బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ప్రాఢ్..!!
- February 27, 2026
మనామా: బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ఫ్రాడ్ కేసు నమోదైంది. తనది కాని బ్యాంక్ కార్డులను ఉపయోగించి BD25,000 విలువైన BMW 320 కారును కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన అరబ్ నిందితుడికి విధించిన మూడు సంవత్సరాల జైలు శిక్షను మొదటి హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది. BD3,000 జరిమానా, శిక్ష అనుభవించిన తర్వాత శాశ్వతంగా బహిష్కరించాలని, నేరంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసినట్లు తెలిసింది.
కోర్టు రికార్డుల ప్రకారం, నిందితుడు ఒక కారు డీలర్‌షిప్‌ను సందర్శించి వాహనాన్ని ఎంచుకున్నాడు. కంపెనీ ఆన్‌లైన్ కు చెల్లింపు పోర్టల్ ద్వారా లావాదేవీని పూర్తి చేయాలని భావించారు. పేమెంట్ లింక్ అందుకున్న తర్వాత, అతను డిసెంబర్‌లో డబ్బును బదిలీ చేయడం ప్రారంభించాడు. మొత్తం BD 10,080 విలువైన 18 ప్రత్యేక లావాదేవీలు చేశాడు. కానీ జరిగిన పేమెంట్స్ మాత్రం అతనివి కావు. అనంతరం దర్యాప్తులో అతను ఆసియా మరియు యూరోపియన్ దేశాలలోని వ్యక్తులకు చెందిన బ్యాంక్ కార్డ్ వివరాలను నమోదు చేశాడని, కార్డ్ నంబర్లు, గడువు తేదీలు మరియు ధృవీకరణ కోడ్‌లు (CVV) నమోదు చేశాడని విచారణలో పోలసులు తేల్చారు.
తాజా వార్తలు
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!
- బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ప్రాఢ్..!!
- ఖతార్ లో QR18 బిలియన్లు దాటిన ఆన్‌లైన్ సేల్స్..!!
- కువైట్ లో ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..!!
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు









