16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్
- February 27, 2026
సోషల్ మీడియా వేదిక Instagram చిన్నారుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వినియోగదారులు ఆత్మహత్యకు సంబంధించిన కంటెంట్‌ను వెతికితే, వారి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం వెళ్లేలా ప్రత్యేక అలర్ట్ వ్యవస్థను తీసుకురానుంది.
ఈ కొత్త ఫీచర్ ముందుగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో వచ్చే వారం నుంచి అందుబాటులోకి రానుంది.యువతపై సోషల్ మీడియా ప్రభావం పెరుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో Meta Platforms ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
యువత సోషల్ మీడియా వినియోగం పై పెరుగుతున్న చర్చ
ఇటీవలి కాలంలో పలుదేశాలు యువత సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణలు విధించే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా వంటి దేశాలు కఠిన నిబంధనలపై ఆలోచిస్తున్నాయి. భారత్‌లోనూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాలు సోషల్ మీడియా వినియోగంపై పరిమితుల దిశగా చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. యువత మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యంగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!
- ఖతార్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ వీక్ 2026..!!
- బహ్రెయిన్‌లో అక్టోబర్ 9న ‘ట్రిబ్యూట్ టు బహ్రెయిన్’..!!
- కువైట్‌లో 77 సంస్థలకు ఫైర్ సేఫ్టీ హెచ్చరికలు..!!
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు







