రియాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన టెర్మినల్ కెపాసిటీ పెంపు..!!
- February 28, 2026
రియాద్: రియాద్ లోపి కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెరిగింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 16 నుండి 25 వరకు నిర్వహించిన టెర్మినల్ అప్డేట్ ప్రాజెక్టు పూర్తయింది. ఇది దేశీయ మరియు అంతర్జాతీయ విమానాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరగడం మరియు దశలవారీ విస్తరణ లక్ష్యాలకు అనుగుణంగా కెపాసిటీని పెంచినట్లు వెల్లడించారు.
టెర్మినల్స్ 1 మరియు 2 జాతీయ క్యారియర్‌ల అంతర్జాతీయ విమానాల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. టెర్మినల్స్ 3 మరియు 4 జాతీయ క్యారియర్‌ల దేశీయ విమానాల కోసం కేటాయించారు. టెర్మినల్ 5 విదేశీ క్యారియర్‌ల అంతర్జాతీయ విమానాలకు కేటాయించారు. దీంతో ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందడంతోపాటు వేగంగా ఎగ్జిట్ ప్రక్రియ పూర్తవుతుందని రియాద్ విమానాశ్రయాల సిఇఒ అమాన్ అబు అబా తెలిపారు.
ఎయిర్ పోర్ట్ ప్రస్తుతం7,650 కంటే ఎక్కువ ఫ్లైట్స్ తోపాటు 1,046,016 మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. రాబోయే రోజుల్లో వార్షిక సామర్థ్యాన్ని 16 మిలియన్ల నుండి 25 మిలియన్ల ప్రయాణికులకు పెంచుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం విమానాశ్రయ సామర్థ్యం 2025లో 42 మిలియన్ల ప్రయాణికుల నుండి 2026 చివరి నాటికి 56 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







