ఇరాన్ పాఠశాల పై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

- February 28, 2026 , by Maagulf
ఇరాన్ పాఠశాల పై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దళాలు జరుపుతున్న వైమానిక దాడులు తీవ్రరూపం దాల్చాయి.ఈ క్రమంలో తాజాగా ఇరాన్‌లోని మినాబ్ నగరంలో జరిగిన ఒక ఘోర వైమానిక దాడి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఒక పాఠశాల లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.

ఈ భయంకరమైన దాడిలో సుమారు 36 మంది విద్యార్థులు అక్కడికక్కడే మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. విద్యాసంస్థపై జరిగిన ఈ దాడిలో చిన్నారులు బలికావడం అత్యంత విషాదకరంగా మారింది. మినాబ్ ప్రాంతంలోని పాఠశాల భవనం ఈ క్షిపణి దాడుల ధాటికి పూర్తిగా ధ్వంసమైంది. ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ వాదిస్తున్నప్పటికీ, జనసమ్మర్థం ఉన్న పాఠశాలలు, జనావాసాలపై దాడులు జరగడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనతో ఇరాన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమాయక విద్యార్థుల మరణానికి ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. మరోవైపు, ఈ దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో అభద్రతా భావం పెరుగుతోంది. అంతర్జాతీయ సమాజం మరియు మానవ హక్కుల సంఘాలు ఈ ఘోర కలికలంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని కోరుతున్నాయి. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఈ ప్రతీకార దాడులు ఏ క్షణమైనా పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com