కువైట్‌లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- February 28, 2026
కువైట్ సిటీ ఫిబ్రవరి 28:ప్రాంతీయంగా నెలకొన్న ప్రస్తుత భద్రతా పరిస్థితుల నేపథ్యంలో కువైట్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా పరిణామాలను గమనిస్తూ, తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
ముఖ్యమైన మార్గదర్శకాలు:
అప్రమత్తత అవసరం: ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. స్థానిక భద్రతా నిబంధనలను, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి.
వార్తలను గమనించండి: కువైట్ ప్రభుత్వం చేసే అధికారిక ప్రకటనలను, వార్తా మాధ్యమాలను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలని రాయబార కార్యాలయం కోరింది.
సాధారణ సేవలు: ఎంబసీ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని, తదుపరి అప్డేట్స్ కోసం వేచి ఉండాలని స్పష్టం చేసింది.
సహాయం కోసం సంప్రదించండి:
భారతీయులకు ఏదైనా సందేహాలున్నా లేదా అత్యవసర సహాయం కావాలన్నా ఈ క్రింది మార్గాల ద్వారా ఎంబసీని సంప్రదించవచ్చు:
హెల్ప్‌లైన్ నంబర్: +965 65501946 ఈమెయిల్: [email protected]
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం
- దుబాయ్‌లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్‌కు 2.7మిలియన్ కాల్స్..!!
- క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్..ప్రపంచంలో మూడో స్థానంలో ఒమన్..!!
- కింగ్ ఫహద్ రోడ్డులో వారం రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- నిర్మాణ పనుల శబ్దాలతో ఇబ్బందులు.. తెరపైకి కొత్త ప్రతిపాదన..!!
- ఖతార్‌లో సమ్మర్ సందడి.. కుటుంబాలతో ఎంజాయ్‌మెంట్‌కు స్వాగతం..!!
- యూఏఈ బతుకమ్మ సంబరాలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- అమెరికా-ఇరాన్ చర్చలు సఫలమైతే తగ్గనున్న ఇంధన ధరలు: ట్రంప్
- షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు రాహుల్ డిమాండ్







