16 థియేట్రికల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసిన ఈటీవి విన్
- February 28, 2026
మూడు బ్లాక్ బస్టర్ ఇయర్స్ పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈటీవి విన్ భారతదేశంలో రీజినల్ కంటెంట్‌కు ఏకైక OTT ప్లాట్‌ఫారమ్‌గా తన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. వరుస ఒరిజినల్ బ్లాక్‌బస్టర్లతో కేవలం మూడు ఏళ్లలోనే తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అగ్రగామిగా ఎదిగింది. మూలాలకు దగ్గరగా ఉన్న కథలను ప్రేక్షకులకు అందిస్తూ, దేశవ్యాప్తంగా, విదేశాల్లో విశ్వసనీయమైన సబ్‌స్క్రైబర్ బేస్‌ను నిర్మించుకుంది.
గత ఏడాది బ్లాక్ బస్టర్ ఇయర్ నిలిచింది. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, అనగనగా, కానిస్టేబుల్ కనకం, AIR వంటి వరుస విజయవంతమైన ఒరిజినల్స్ అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ విజయ పరంపర ETV Winను రీజినల్ OTT రంగంలో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిపింది.
ఈ వేగాన్ని కొనసాగిస్తూ, ఇప్పుడు ETV Win మరొక దశలోకి అడుగుపెడుతోంది. పూర్తిగా రీడిజైన్ చేసిన యూజర్ ఇంటర్‌ఫేస్ మరింత స్లీక్, ఇన్‌ట్యూయిటివ్, ఇమర్సివ్ అనుభవాన్ని అందిస్తోంది. అన్ని డివైసెస్‌లో సులభమైన నావిగేషన్, మెరుగైన కంటెంట్ డిస్కవరీ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
మల్టీ లాంగ్వేజ్ సదుపాయాలను విస్తరించి తెలుగు కథలను భాషా సరిహద్దులను దాటి జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీలతో, అత్యుత్తమ HDR విజువల్స్, స్పేషియల్ ఆడియోతో థియేటర్‌లాంటి అనుభూతిని ఇంట్లోనే అందిస్తోంది.
2026–2027 కోసం ETV Win 16 థియేట్రికల్ రిలీజులు, రెండు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో భారీ కంటెంట్ రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది. ఈ లైనప్‌లో ప్రముఖ నటీనటులు రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ పాకశాల పంతం, ఆది సాయి కుమార్ సబ్ ఇన్ స్పెక్టర్ యుగంధర్, సుమంత్ న్యూటన్ థర్డ్ లా, తిరువీర్ పాపం ప్రతాప్, జెడి చక్రవర్తి #DM, వర్ష బొల్లమ్మ కానిస్టేబుల్ కనకం చిత్రాలు ముందుగా థియేటర్స్ లో అలరించబోతున్నాయి.
బ్లాక్ బస్టర్ నిర్మాత రాజేష్ దండా తొలిసారి ETV Win తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్ నం. 9 ని అనౌన్స్ చేయడం మరో విశేషం.
వీటితో పాటు లిటిల్ థింగ్స్, జిఎస్కే, గుర్తుకొస్తున్నాయి, జిల్లేడు చెట్టు, మండువలోగిలి చిత్రాలు థియేటర్స్ లో అలరించబోతున్నాయి.
మూడు సక్సెస్ ఫుల్ ఇయర్స్ పూర్తి చేసుకున్న ETV Win, కేవలం ఒక స్ట్రీమింగ్ సర్విస్ గానే కాకుండా, భారతదేశంలో రీజినల్ OTTను రీడిఫైన్ చేసింది. వరుస ఒరిజినల్ బ్లాక్‌బస్టర్లు, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు, మల్టీ లాంజ్వేజ్ విస్తరణ, మరింత పెద్ద కథలు, మరింత గొప్ప అనుభవాలు, ప్రపంచస్థాయి తెలుగు వినోదాన్ని ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో ETV Win తన తదుపరి అధ్యాయంలోకి అడుగుపెడుతోంది.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్‌లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









