ఖమేనీ మరణాన్ని ధృవీకరిస్తూ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించిన ఇరాన్
- March 01, 2026
టెహ్రాన్: పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. గల్ఫ్ అంతటా యుద్దాగ్ని జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. దీనికి ప్రతిగా గల్ఫ్ లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులతో విచురుకుపడింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించాయి.
‘ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ’ పేరుతో అగ్రరాజ్యం చేపట్టిన ఈ దాడులతో దేశమంతా అట్టుడికింది. అయితే, ఈ దాడుల్లో అమెరికా, ఇజ్రాయెల్ అనుకుంత పనిచేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని ఖతం చేశాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ప్రకటించారు. ఖమేనీ మరణాన్ని ధృవీకరిస్తూ 40 రోజుల సంతాప దినాలను ప్రకటించిన ఇరాన్.అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవరాలు, కోడలు మరియు అల్లుడు కూడా మరణించారని స్టేట్ మీడియా అంతకుముందు తెలిపింది.
వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాస ప్రాంగణం నేలమట్టమైనట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు పేర్కొన్నారు. ‘ఇప్పటి వరకూ అందిన సంకేతాల ప్రకారం ఆ నిరంకుశుడు జీవించి ఉండకపోవచ్చు’’ అని నెతన్యాహు తెలిపారు. అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్ లో భాగంగా ఖమేనీ నివాస ప్రాంగణంపై 30 బాబులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ‘‘చరిత్రలో అత్యంత దుర్మార్గుల్లో ఒకరైన ఖమేనీ చనిపోయారు. ఇది ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు.. అమెరికన్లందరికీ, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల ప్రజలకు మంచివార్త. ఖమేనీ, అతని ముఠా అత్యంత అధునాతన ట్రాకింగ్ వ్యవస్థలను తప్పించుకోలేకపోయారు. ఇరానియన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే ఏకైక గొప్ప అవకాశం.’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ పై నిరంతరాయంగా భారీ బాంబు దాడులు కొనసాగుతాయి. ఈ దాడులు వారం, అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగవచ్చునని ట్రంప్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్‌లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్‌లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







