జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!
- March 01, 2026
జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!
దుబాయ్: జెబెల్ అలీ పోర్టులోని ఒక బెర్త్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి డ్రోన్ శిథిలాలే కారణం అని దుబాయ్ అధికారులు తెలిపారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు.ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు.
కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో 2021, జూలై 7 నాటిదని, ఇక అలాంటి పాత వీడియోను ప్రసారం చేయవద్దని అధికారులు ప్రజలను కోరారు. ఇరాన్ చేసిన డ్రోన్ దాడి సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే, తప్పుడు వీడియోలను షేర్ చేయడం ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన వారవుతారని హెచ్చరించారు. అధికారిక ఛానెల్స్ ద్వారా మాత్రమే సమాచారాన్ని పొందాలని సూచించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్‌నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







