తిరుమలలో 'కొత్త దంపతులకు' వీఐపీ దర్శనం కల్పించనున్న'టి.టి.డి'

- July 22, 2015 , by Maagulf
తిరుమలలో 'కొత్త దంపతులకు' వీఐపీ దర్శనం కల్పించనున్న'టి.టి.డి'
తిరుపతిలో వివాహ వేదిక టూరిజం అభివృద్ధికి ప్రాంతాలవారీ బ్యూరోలు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ విస్తృత పరచడానికి ప్రణాళికలు రూపొందించినట్టు వెల్లడించారు. పర్యాటకాభివృద్ధిపై సీఐఐ విశాఖ చాప్టర్‌ మంగళవారం పార్కు హోటల్‌లో నిర్వహిం చిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది వారి పిల్లలకు తిరుపతిలో వివాహం జరి పించాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఇటువంటి వారి కోసం తిరుపతిలో వివాహవేదిక నిర్మించాలని ప్రతిపాదించామన్నారు. వివాహం అ నంతరం కొత్త దంపతులు, ఇరువైపుల తల్లిదండ్రులు మొత్తం ఆరుగురికి తిరుమలలో వీఐపీ దర్శనం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలలో పొందుపరుస్తున్నామన్నారు. దీనికోసం త్వరలో తిరుపతిలో టూర్‌ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పర్యాటక ప్రాజెక్టులు వేగవంతం చేయడంతోపాటు వివిధ వర్గాలను భాగస్వాములను చేస్తామన్నారు. దీనికి ప్రాంతాలవారీగా టూరిజం ప్రమోషన్‌ బ్యూరోలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తొలుత విశాఖపట్నం నుంచే ప్రమోషన్‌ బ్యూరోలు ప్రారంభిస్తామన్నారు. నెల్లూరు, తిరుపతి, అనంతపురం....ఇలా ప్రతీ నోడ్‌లో ఆయా ప్రాంతాల్లో ఉన్న పర్యాటక స్థలాలను కలుపుతూ అభివృద్ధి సాగిస్తామన్నారు. పర్యాటక విస్తరణలో భాగంగా అన్ని దేశాల నుంచి ఎయిర్‌ కనెక్టివిటీని మరింత పెంచుతామని పేర్కొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com