ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- March 02, 2026
హైదరాబాద్: తెలంగాణ (TG) ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే భారీగా మహిళలు ఈ ఫ్రీ బస్ పథకాన్ని ఉపయోగించుకోవడంతో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఫుల్ అవుతున్నాయి. దీంతో డబ్బులు చెల్లించి ప్రయాణించే పురుషులు నిలబడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అదే సమయంలో డీలక్స్, లగ్జరీ, ఏసీ బస్సుల్లో పూర్తి స్థాయిలో సీట్లు నిండటం లేదు. ఇక హైదరాబాద్ మహా నగరంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏసీ బస్సులను ఆయా రూట్లలో నడుపుతోంది. ఉచిత బస్సు ప్రయాణం కావడంతో మహిళలు ఈ ఏసీ బస్సుల వైపు చూడటం లేదు. ఇక టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో పురుషులు కూడా చాలా మంది ఈ ఏసీ బస్సులు ఎక్కేందుకు ఆసక్తి చూపించడం లేదు.
ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు, మెట్రో డీలక్స్ బస్సులు 60 శాతం నుంచి 70 శాతం వరకు ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయని గుర్తించారు. ఈ క్రమంలోనే ఏసీ బస్సుల్లో టికెట్ ధరలను తగ్గిస్తూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులను ఏసీ బస్సుల్లో ఎక్కేలా చేయాలని నిర్ణయించుకుంది. టికెట్‌పై కనిష్టంగా రూ.5 తగ్గించగా.. గరిష్టంగా రూ.10 వరకు ఈ రాయితీ వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
ఏసీ బస్సుల్లో 5 స్టేజీలు లేదా 10 కిలోమీటర్ల దూరానికి ప్రస్తుతం టికెట్ ధర రూ.50 ఉండగా.. తాజాగా ప్రకటించిన రాయితీతో కేవలం రూ.40 కే ప్రయాణించవచ్చు. అదే విధంగా 10 స్టేజీలు లేదా 20 కిలోమీటర్ల దూరానికి ప్రస్తుతం నాన్ ఏసీ సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.55 టికెట్ ధర ఉండగా.. రూ.10 రాయితీ కల్పించడంతో రూ.45 కే ప్రయాణించవచ్చు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!
- 2030 విజన్ కోసం ఖతార్ కీలక అడుగు..!!
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు–15 మంది మృతి!
- పాస్‌పోర్ట్ అవసరం లేదు.. లగేజ్ ట్యాగ్ కూడా ఉండదు..!!
- షార్జా ఎక్స్పో సెంటర్లో మమ్ముట్టి ‘రాజకీయమ్’ షో..







