దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- September 20, 2026
సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు.. 7,000 మందికి పైగా భక్తుల దర్శనం
దుబాయ్: దుబాయ్‌లోని సోనాపూర్ క్యాంప్‌లో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బు హలీబా, సుల్తాన్ కంపనీలకు చెందిన కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కార్మికులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈరోజు జరిగిన గణేష్ ఉత్సవాల్లో సుమారు 7,000 మందికి పైగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనీయమైన సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సోనాపూర్ క్యాంప్‌లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
భక్తులకు ఉచిత అన్నదానం
ఉత్సవాలకు హాజరైన భక్తుల కోసం నిర్వాహకులు ఉచిత ఆహారాన్ని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు, భక్తులు గణనాథుడిని దర్శించుకుని, పూజల్లో పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను పలువురు అభినందించారు.
సోనాపూర్ క్యాంప్‌లో గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తి, సాంస్కృతిక వాతావరణం నెలకొంది.






తాజా వార్తలు
- శ్రీలంకలో కడప ఎన్నారై మహమ్మద్ అరీఫ్‌కు అంతర్జాతీయ పురస్కారం
- 6వ హజ్ కాన్ఫరెన్స్ 2027లో పాల్గొనేందుకు జెడ్డాకు చేరుకున్న భారత ప్రతినిధి బృందం
- దుబాయ్‌లో భారత్–యూఏఈ స్నేహబంధానికి ప్రతీకగా 5 కిలోమీటర్ల ఫిట్నెస్ రన్
- భారతీయుడికి వైద్య అత్యవసర పరిస్థితి.. హెలికాప్టర్లో తరలించిన ఒమన్ వైమానిక దళం
- ఢిల్లీలో వాయు కాలుష్యం.. అమల్లోకి మూడో దశ ఆంక్షలు
- పదో తరగతి, ఇంటర్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఫిబ్రవరి 16 నుంచే.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
- దుబాయ్‌లో నవంబర్ 16 నుంచి వరల్డ్ పోలీస్ సమ్మిట్ 2026.. 90కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు
- యూఏఈలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..
- తెలంగాణ పోలీసుల ఆరోగ్యానికి ‘ఫిట్‌కాప్’.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక చర్యలు
- 5G-A ఇంటర్నెట్ వేగంలో గల్ఫ్‌లోనే కువైట్ టాప్..!!







