15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!

- March 03, 2026 , by Maagulf
15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!

యూఏఈ: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంతో ప్రభావితమైన మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలలో నివసిస్తున్న తన పౌరులకు అమెరికా హెచ్చరిక జారీ చేసింది.తీవ్రమైన భద్రతా ప్రమాదాల కారణంగా వాణిజ్య మార్గాల ద్వారా వెంటనే బయలుదేరాలని కోరింది.

బహ్రెయిన్, కువైట్, ఈజిప్ట్, లెబనాన్, ఇరాన్, ఒమన్, ఇరాక్, ఖతార్, ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్ మరియు గాజా, సౌదీ అరేబియా, సిరియా, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యెమెన్ దేశాల్లో ఉన్న అమెరికన్లు వెంటనే ఆయా దేశాలను విడిచి వెళ్లాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది.  మరింత సమాచారం కొసం సమీపంలోని యూఎస్ రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ లను సంప్రదించాలని కోరింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com