ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్

- March 04, 2026 , by Maagulf
ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్

దోహా: ఖతార్ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ కోసం పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఖతార్ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. పటిష్టమైన ట్రాకింగ్ కార్యకలాపాల ఫలితంగా పది మంది అనుమానితులను అరెస్టు చేశామని,  వారిలో ఏడుగురు కీలకమైన సైనిక మౌలిక సదుపాయాల సమాచారాన్ని చేరవేస్తూ గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు.మిగితా ముగ్గురు విధ్వంసక కార్యకలాపాలను నిర్వహించడానికి మరియు డ్రోన్‌ల వాడకంలో శిక్షణ పొందారని మంత్రిత్వశాఖ తెలిపింది. 

అనుమానితుల వద్ద నుంచి సున్నితమైన రక్షణ సంబంధిత సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దర్యాప్తు సమయంలో, అనుమానితులు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్‌తో తమకున్న సంబంధాలను అంగీకరించారు. గూఢచర్యం మరియు విధ్వంసక కార్యకలాపాలను నిర్వహించడానికి వారిని నియమించినట్లు పేర్కొన్నారు. పౌరులు మరియు నివాసితులు అప్రమత్తంగా ఉండాలని మరియు ఏవైనా అనుమానిత కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే అధికార సంస్థలకు నివేదించాలని అంతర్గత మంత్రిత్వశాఖ కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com