ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- March 05, 2026
దుబాయ్: ఫైర్ వర్క్స్ వినియోగంపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఫైర్ వర్క్స్ కలిగి ఉండటం లేదా వ్యాపారం చేయడం ప్రాణాలకు, ఆస్తికి మరియు సమాజంలో వాటి వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాల గురించి సోషల్ మీడియా పోస్టులో ప్రజలకు దుబాయ్ పోలీసులు గుర్తు చేశారు.
యూఏఈలో అమల్లో ఉన్న చట్టాలను గౌరవించాలని కోరారు. ప్రజలు 901 కాల్ సెంటర్‌ను సంప్రదించడం ద్వారా ఏవైనా కేసులను నివేదించాలని కోరారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినా లేదా వినియోగించినా జరిమానా కింద సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు Dh100,000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.
షార్జా పోలీసులు ఇటీవల 18,670 అక్రమ ఫైర్ వర్క్స్ వస్తువలను కలిగి ఉన్న వ్యక్తిని ఇటీవల అరెస్టు చేశారు. 2019 నాటి ఫెడరల్ డిక్రీ లా నంబర్ 17లోని ఆర్టికల్ 54 ప్రకారం అనుమతి లేని ఫైర్ వర్క్స్ వ్యాపారం యూఏఈలో నేరంగా పరిగణిస్తారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసినా, దిగుమతి చేసుకున్నా, ఎగుమతి చేసినా, తయారు చేసినా లేదా తీసుకువచ్చే ఎవరైనా చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!
- ఖతార్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ వీక్ 2026..!!
- బహ్రెయిన్‌లో అక్టోబర్ 9న ‘ట్రిబ్యూట్ టు బహ్రెయిన్’..!!
- కువైట్‌లో 77 సంస్థలకు ఫైర్ సేఫ్టీ హెచ్చరికలు..!!
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు







