త్రివిక్రమ్ చేతుల్లోకి మోక్షజ్ఞ...
- August 01, 2016
మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్. అ ఆ సినిమా తరువాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో సినిమా తీస్తాడనేది అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసిన త్రివిక్రమ్ తాజాగా నితిన్‌తో 'అ.. ఆ' సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు ఏ హీరోతో సినిమా తీయాలి.. అని ఆలోచిస్తున్న త్రివిక్రమ్‌కి ఒక బంపర్ ఆఫర్ వచ్చిందని సమాచారం. ఆ ఆఫర్ నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిందని... అది బాలకృష్ణ కొడుకుకి సంబంధించిన విషయమని టాక్. నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞని హీరోగా పరిచయం అయ్యే మూవీ.. త్రివిక్రమ్ చేతుల్లోకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మోక్షజ్ఞ... బాలకృష్ణ 100వ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూనే నటనలో మెళకువలు కూడా నేర్చుకుంటున్నాడని, మోక్షజ్ఞ తెరంగేట్రం చేసే సినిమా త్రివిక్రమ్ చేతిలో పడితే మొదటి సినిమాతోనే మోక్షజ్ఞకి మంచి పేరొస్తుందని బాలకృష్ణ భావిస్తున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







